హీరో రామ్ గతంలో లవ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలలోనే నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా తనలోని మాస్ హీరోని బయటికి తీశారు. ఆ తర్వాత ఎక్కువగా ఇలాంటి పాత్రలకే మక్కువ చూపుతున్నారు రామ్. తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ నెల 28వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది


ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది. ట్రైలర్లో రామ్ మాస్ గెటప్ లో అదిరిపోయేలా మెప్పించాడు. తాజాగా ఇప్పుడు మరొక కొత్త ట్రైలర్ సైతం చిత్ర బృందం థియేటర్లో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ని చూస్తూ ఉంటే పూర్తిగా మాస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కనిపిస్తోంది. అలాగే డైలాగులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. మరొకసారి బోయపాటి శ్రీను తన మార్కు చూపించబోతున్నట్లు కనిపిస్తోంది.

ఈ సినిమాలో బోయపాటి మూడు యాక్షన్ సీన్స్ ని హైలైట్ గా డిజైన్ చేసినట్లుగా కనిపిస్తోంది. అవి ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతాయని అభిమానులు నమ్ముతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత హైలెట్గా నిలుస్తుందని తెలియజేశారు. గతంలో బోయపాటి తమన్ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాకి కూడా బీజీఎమ్తో థియేటర్లో బాక్సులు బద్దలయ్యేలా చేశారు. ఇప్పుడు స్కంద సినిమా కి కూడా మరొకసారి  థమన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. ఇందులో స్పెషల్ సాంగ్ లు ఊర్వశి రౌతెలా నటిస్తోంది ఈ సినిమా కూడా పాన్ ఇండియా లేవలో అన్ని భాషలలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో రామ్ సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: