ఇండస్ట్రీలో అందాల ఆరబోత చేయనిదే స్టార్ హీరోయిన్గా ఎదగలేము అని అందరూ అనుకుంటున్న వేళ.. అలాంటి భావాలను నేను దూరం చేస్తా అనే పట్టుదలతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది సాయి పల్లవి. ఇక తన నటనతోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి ఇండస్ట్రీలో రాణించాలంటే అందాల ఆరబోత అవసరం లేదు అన్న విషయాన్ని నిరూపించింది. ఇక కథల ఎంపికలో ఎంతో ఆచీతూచి అడుగులు వేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇక తాను చేసే సినిమాల విషయంలో అస్సలు రాజీపడదు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమెలో ఉన్న ఇలాంటి ఆలోచన ఆమెను అందరిలో కెల్లా ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది. ప్రస్తుతం భాషతో  సంబంధం లేకుండా సాయి పల్లవి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది అని చెప్పాలి. అయితే ఇక టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలతో మంచి స్నేహబంధం కూడా కొనసాగిస్తుంది సాయి పల్లవి. అయితే టాలీవుడ్ లో ఉన్న ఒక క్రేజీ హీరో చేసిన పనికి సాయి పల్లవి ఎంతగానో బాధ పడిందట. ఏకంగా షూటింగ్స్ స్పాట్ లోనే కన్నీళ్లు పెట్టుకుని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిందట.


 ఆ హీరో ఎవరో కాదు నాచురల్ స్టార్ నాని. నాని కెరియర్లో సూపర్ హిట్ మూవీ గా నిలిచింది ఎంసీఏ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017 చివర్లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నానికి సాయి పల్లవికి మధ్య ఈగో ప్రాబ్లం వచ్చిందని.. ఇక ఎవరికి వారు మేమే గొప్ప అనుకోవడంతో గొడవ పెరిగి పెద్దదైందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఓ రోజు నాని సాయి పల్లవిని బాగా ఇబ్బంది పెట్టడంతో హార్ట్ అయిన సాయి పల్లవి షూటింగ్ స్పాట్  నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయిందట. కానీ ఆ తర్వాత నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ జోక్యం చేసుకోవడంతో ఇక ఈ ఇష్యూ సెటిల్ అయ్యిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: