సౌత్ ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోయిన్లు గ్లామర్ ను నమ్ముకుని అవకాశాలు దక్కించుకుంటే.. ఎక్కడ అందాల ఆరబోత చేయకుండా టాలెంట్ తో స్టార్ హీరోయిన్గా మారిన వారు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు. అలాంటి హీరోయిన్లు కొంతమంది ఉండగా.. అందులో నిత్యా మీనన్ కూడా ఒకరు అని చెప్పాలి. ఆమె ఎలాంటి పాత్ర పోషించిన ఆ పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటుంది. ఒక్క నిత్యా మీనన్ తప్ప ఆ పాత్రను ఇంకెవరూ అంత అద్భుతంగా చేయలేరేమో అనేంతగా తన నటనతో ఆకట్టుకుంటుంది.


 అందాల ఆర బోతకు దూరంగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకు దగ్గరగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది ఈ హీరోయిన్. ఒకరకంగా చెప్పాలంటే ఆమె పూర్తిస్థాయి ఫెమినిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి అని చెప్పాలి. అయితే నిత్యామీనన్ ఇలాంటి ఆలోచన తీరుతో ఉండడంతోనే ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో ఎంపిక కాలేక పోతుంది. కాగా టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న తారక్ నిత్యామీనన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమె ఒక గొప్ప నటి అంటూ ప్రశంసలు కురిపించాడు. ఆమెను ఇండస్ట్రీస్ సరిగ్గా వాడుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.


 ఆమెలాంటి నటిమని ఎవరికీ దొరకదని.. ఆమె సినిమాలో నటిస్తుంది అంటే ఒక రకమైన ఎనర్జీ ఉంటుందని.. అందుకే నిత్యామీనన్ కు మంచి సినిమాలు వస్తే ఆమె తన నిజమైన నటనని బయటకు తీసుకు రాగలదు అంటు జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించాడు. కాగా జూనియర్ ఎన్టీఆర్ నిత్యామీనన్ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ అనే సినిమా సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే నిత్యామీనన్ తన నటనతో పక్క వాళ్ళను డామినేట్ చేస్తుందని.. ఆమెకు ఇంకా మంచి సినిమాలు పడి ఉంటే బాగుండేది అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. ఇక నిత్యామీనన్ నటించిన ప్రతి సినిమా చూస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు తారక్.

మరింత సమాచారం తెలుసుకోండి: