
ఇప్పుడు కాంతారా సీక్వెల్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది రిషబ్ శెట్టి. దీనికోసం కొన్ని రోజులు స్క్రిప్ట్ వరకు కూడా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేయడం జరుగుతోందట.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారు. కాంతారా సినిమాకి కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా కథ మొత్తం ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో చెప్పడంతో పాటు బ్యాక్ స్టోరీని కూడా ముందుగా తక్కువగా టచ్ చేయడంతో పెద్దగా బడ్జెట్ కాలేదట.
కానీ ఈసారి కాంతారా-2 ని ఫ్రీక్వల్ గా తెరకెక్కించాలని రిషబ్ శెట్టి సిద్ధం చేస్తున్నారట. అంటే కాంతారావు సినిమాలో చూసిన కథని ముందుగా ఏం జరిగింది అనేకదాంశాన్ని సీక్వెల్లో చూపించబోతున్నారు. దీనిని కూడా చాలా గ్రాండ్ గా సిల్వర్ స్క్రీన్ పైన ఆవిష్కరించే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ చిత్రంలోని పాత్ర డిమాండ్ మేరకు ప్రాచీన యుద్ద విద్యలను సైతం రిషబ్ శెట్టి నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 125 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పైన దేశవ్యాప్తంగా అక్షరాలు పెరిగిపోవడంతో ఈ సినిమాలోని క్యాస్టింగ్ పరంగా కూడా పలుమార్పులు చేయబోతున్నట్లు సమాచారం.