తెలుగు సినీ పరిశ్రమలో మంచు గుర్తింపు కలిగిన దర్శకులలో హను రాఘవపూడి ఒకరు. ఈయన అందాల రాక్షసి మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తో మంచి ప్రశంశలను ప్రేక్షకుల నుండి , విమర్శకులను అందుకున్నాడు. ఇక ఆ తరువాత నాని హీరోగా రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తో ఈ దర్శకుడి క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు లై , పడి పడి లేచే మనసు సినిమాలకు దర్శకత్వం వహించాడు ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

ఇక ఇలా రెండు వరుస అపజయాల తర్వాత ఈ దర్శకుడు దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా సీత రామం అనే సినిమాని రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈ దర్శకుడి క్రేజ్ అదిరిపోయే రేంజ్ లో పెరిగి పోయింది. దానితో సీత రామం మూవీ తర్వాత ఈ దర్శకుడి కి ప్రభాస్ నుండి ఆఫర్ కూడా వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్ తో మూవీ కోసం ఓ కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఓ కథను పూర్తిగా రెడీ చేసి ప్రభాస్ కి వినిపించబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే హను రాగవపూడి చెప్పిన కథ ప్రభాస్ కి నచ్చినప్పటికి విరి కాంబో లో మూవీ సలార్ పార్ట్ 2 ,  ప్రాజెక్ట్ కే ,  మారుతి సినిమాల తరువాతే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే మూ వీలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతున్నది అనే విషయం గురించి ఎలాంటి అప్డేట్ ఇప్పటి వరకు లేదు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: