నటన ఒకటే కాకుండా ముక్కుసూటిగా మాట్లాడే నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈ నటి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికంగా వైరల్ అవుతున్నాయి. ఒక పోస్ట్ షేర్ చేయడం వల్ల ఈ వార్తలకి మరింత బలం చేకూరింది అని చెప్పాలి. బాలీవుడ్ నటి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు ప్రస్తుతం ఊబందుకున్నాయి. వాటితో పాటు ఇప్పుడు ఈ నటుడు షేర్ చేసిన పోస్ట్ మరింత హాట్ టాపిక్ గా మారింది. సినీ ప్రపంచంలోని ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి అని అనుకునే నటుడు

కమల్ ఆర్ ఖాన్ తాజాగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ పోస్ట్ తర్వాతే నటి పెళ్లి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి. కె ఆర్ కె తాజాగా ఒక పోస్ట్ షేర్ చేస్తూ బ్రేకింగ్ న్యూస్ కంగన ఒక వ్యాపారవేత్త తో డిసెంబర్లో 2023లో నిశ్చితార్థం చేసుకోబోతుంది అని.. ఏప్రిల్ 2024 లో వివాహం చేసుకోబోతున్నారు అని ముందుగా ఈ నటికి అభినందనలు అంటూ ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. అయితే ఇదివరకే ఆయన షేర్ చేసే పలు రకాల పోస్ట్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. కొన్నిసార్లు వివాదాస్పద ప్రకటనల కారణంగా ఆయన

 అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన చెప్పేది నిజమా అబద్దమా అన్నది క్లారిటీ రాలేదు. ఇక ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఆ పోస్ట్ పై కంగనా ఇంకా స్పందించలేదు. కానీ వినియోగదారులు ఈయన పోస్ట్పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక కంగనా సినిమాల విషయానికి వస్తే త్వరలోనే చంద్రముఖి 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి.  కంగనా చాలా కాలంగా ప్రమోట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల అవుతోంది. ఈ సినిమానే కాకుండా పలు రకాల సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: