ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు రాజమౌళి ను పక్కన పెట్టేసారు అన్న వార్తలు వినబడుతున్నాయి. గుంటూరు కారం సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తో సినిమాకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా సరే ఎగిరి గంతేస్తాడు. ఆయనతో సినిమా అంటే కచ్చితంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. ఇమేజ్ ఎంతలా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బాహుబలి సినిమాతో ప్రభాస్ ను  పాన్ ఇండియా హీరో చేశాడు రాజమౌళి. వందల కోట్ల బడ్జెట్ సినిమాలను చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం 100 నుండి 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇటీవల అర్ అర్ అర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల పేర్లు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా వినిపిస్తున్నాయి. ఏకంగా ఆస్కార్ని సైతం కొల్లగొట్టాడు రాజమౌళి. సాధారణంగా రాజమౌళి రిపీటెడ్ గా కొందరు హీరోలతో మాత్రమే ఈ సినిమాలు చేస్తారు. మరికొందరు హీరోలతో మాత్రం ఎప్పటికీ సినిమాలు చేయరు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మహేష్ బాబు లతోపాటు

 పలువురు రాజమౌళితో పని చేయాలి అని కోరుకుంటున్నారు. ఎట్టకేలకు ఆ చాన్స్ మహేష్ బాబుకు దక్కింది. అయితే కోవిడ్ సమయంలో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. అయితే తాజాగా ఇప్పుడు రాజమౌళిని పక్కన పెట్టిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అనిల్ సుంకర ఈ సినిమానీ నిర్మిస్తున్నారట. రాజమౌళిని కాదని అనిల్ రావిపూడి తో మహేష్ బాబు ఇప్పుడు సినిమా చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: