నటి అమీ జాక్సన్ కొత్త లుక్ సోషల్ మీడియాలో భారీగా విమర్శలను అందుకుంది. నేటిజన్స్ ఆమెను తీవ్రంగా చాలా నెగిటివ్ గా ట్రోల్స్ సైతం చేశారు. ఐరిష్ స్టార్ యాక్టర్ సిలియన్ మర్ఫీని పోలినట్టు ఆమె కొత్త లుక్ ఉంది అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఈ ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యింది ఈ నటి. భారతీయుల నుండి ఇటువంటి విమర్శలు ఎదుర్కోవడం చాలా బాధాకరం గా ఉంది అని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇండియన్స్ నుండి ముఖ్యంగా మగవాళ్ళు ఇటువంటి ట్రొల్స్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం..

ఒక స్త్రీ తన అందానికి వ్యతిరేకంగా ఉన్న విధంగా తయారైతే ట్రోల్స్ చేసే హక్కు ఉంది అని వారు భావిస్తున్నారు. ఇక నేను సినిమాలకి తగ్గట్టు లుక్ విషయంలో తరచూ మార్పులు చేసుకునే ప్రముఖ నటులతో కలిసి పని చేస్తున్నాను. ఏదైనా ఒక సినిమా కోసం లుక్ పరంగా మార్పులు చూపిస్తుంది అంటే ఎవరైనా సరే ప్రశంసిస్తారు కానీ నన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం నేను యూకే లో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా కోసమే నా లుక్కుని చేంజ్ చేసుకున్నాను. నేను నా పనిని చాలా పర్ఫెక్ట్ గా చిత్తశుద్ధితో చేస్తాను. అందుకే నేను మరింత

 స్లిమ్ముగా పాత్రకు తగ్గట్టుగా మారాను అంటూ పేర్కొంది. అంతే కాకుండా ఐరిష్ యాక్టర్ సిలియన్ తన లుక్కు ను కంపేర్ చేయడం పై కూడా మాట్లాడింది ఈ నటి. దానికి నేనేమీ బాధపడడం లేదు. అలాంటి ఒక గొప్ప యాక్టర్ తో నన్ను పోల్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది అమీ జాక్సన్. ఇక ఈమె సౌత్ ఇండస్ట్రీ తో పాటు హిందీలో సైతం పలు సినిమాలు చేస్తోంది. 2018 లో విడుదలైన 2.0 తర్వాత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇటీవల ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇటువంటి ట్రోల్స్ ఎదుర్కొంటుంది ఈ నటి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: