విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో భారీ డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ తగ్గిందని చాలా వార్తలు వినిపించాయి. కానీ ఇటీవలే వచ్చిన ఖుషి వంటి సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నారు. ఐదేళ్లుగా సరైన సక్సెస్ లేకుండా ఏ హీరో అయినా ఉంటే.. మార్కెట్ కంప్లీట్ గా పడిపోతుంది కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం అలా జరగలేదు. ప్రతి సినిమాకి మార్కెట్ పరంగా పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం తన కెరియర్ని సైతం స్పీడ్ పెంచే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.


ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా అని అనౌన్స్మెంట్ చేశారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత గీతగోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ డైరెక్టర్ పరశురామ్ తో ఒక సినిమాని చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే విజయ్ దేవరకొండ మరిన్ని సినిమాలను అనౌన్స్మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలే కాకుండా శ్రీ వెంకటేశ్వర బ్యానర్లు దిల్ రాజుతో ఏకంగా మూడు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. అందులో ఒకటి డైరెక్టర్ పరుశురామ్ తో కాగా మరొకటి డైరెక్టర్ రవికుమార్ కొల్లాతో ఒక సినిమా మరొక డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ తో.


ఇలా ఒకే బ్యానర్ పై మూడు సినిమాలను తెరకెక్కిస్తూ ఉండడంతో విజయ్ అభిమానులు కాస్త ఆశ్చర్యపోతున్నారు. ఇవే కాకుండా పలు సినిమాల కథలను వింటున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి ఈ చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తారా లేదా అనే విషయం పైన ఇంకా స్పష్టత రాలేదు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో కూడా పలు రకాల సినిమాలను చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ రేంజ్ ఈ మధ్యకాలంలో మరింత పెరిగిపోతోందని చెప్పవచ్చు. ఇటీవల ఖుషి సక్సెస్ మెట్ల భాగంగా 100 మందికి ఆర్థిక సహాయం కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: