తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి అనే సినిమాలో హీరోగా నటించాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి శివ నిర్వన దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి మూడు రోజులు భారీ కలెక్షన్ లను వసూలు చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమా కలెక్షన్ లు భారీగా డ్రాప్ అయ్యాయి.

దానితో ఈ మూవీ చివరగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ , పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. గోపి సుందర్మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా ... మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఈ సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ విజయ్ కెరీయర్ లో 13 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో "విడి 13" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ ను ఈ చిత్ర బృందం వారు పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 54 వ మూవీ గా రూపొందుతుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ను ఈ మూవీ మేకర్స్ ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసినట్లు ఇదే టైటిల్ ను అఫీషియల్ గా మరికొన్ని రోజుల్లో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: