
కానీ ఈసారి హౌస్ మేట్ అనే పేరుతో సందీప్, శివాజీ, శోభా శెట్టి సంచాలకులుగా కొనసాగుతున్నారు. మిగిలిన పదిమంది మాత్రమే ఆట ఆడుతూ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఈ క్రమంలోని హౌస్ లోకి ఈసారి ఏడు మందిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్. సాధారణంగా ఒకరిద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొస్తారని ప్రచారం ఉండేది. అయితే ఇప్పుడు ఏకంగా ఏడు మందిని తీసుకురాబోతున్నారు . ఈనెల 30వ తేదీన బిగ్ బాస్ హౌస్ లోకి ఏకంగా ఏడు మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.
ఇక ముందు నుంచి వినిపిస్తున్న పేర్లే ఇప్పుడు ఐదో వారం స్టార్టింగ్ లో హౌస్ లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇక వారే అంజలి పవన్, యాంకర్ ప్రత్యూష , యాక్టర్ ఫర్జానా, సుప్రీత , భోలే షావలి, అంబటి అర్జున్ , నరేష్ అంటూ కొన్ని పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంత మంది హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశిస్తారు అని తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మొత్తానికైతే ఈ సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెడితే కచ్చితంగా పోటీ మరింత రసవత్తరంగా ఉంటుందని చెప్పవచ్చు.