సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎన్నో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఇలాంటి సినిమాలలో యాక్షన్ సినిమాలు కొన్ని అయితే లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు మరికొన్ని.. అయితే ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి  ఇక ఇలా వచ్చిన సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను మెప్పించలేక పోతే ఇంకొన్ని మాత్రం ప్రేక్షకుల మధిలో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి అని చెప్పాలి.


 అలాంటి సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ కూడా ఒకటి. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్  అనే పదానికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఇందులో సమంత, అంజలి హీరోయిన్ లుగా నటించారు. రావు రమేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, తనికెళ్ల భరణి కీలక పాత్రలో మెప్పించారు. ఇక మీక్కీజే మేయర్ సినిమా కోసం అందించిన సంగీతం అయితే హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి  ఇప్పటికీ ఈ మూవీ అటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా ఫేవరెట్ మూవీగా కొనసాగుతుంది.



 అయితే సినిమాలో మహేష్ బాబు తమ్ముడు పాత్రలో నటిస్తే వెంకటేష్ అన్న పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది అని చెప్పాలి. మహేష్ బాబు వెంకటేష్ అన్నదమ్ముల పాత్రల్లో ఒదిగిపోయారు. బాగా సెట్ అయ్యారు అని అందరికీ అనిపించింది. కానీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాత్రం ముందుగా అన్న పాత్ర కోసం వెంకటేష్ ను అనుకోలేదట. మరో బడా స్టార్ హీరోని తీసుకోవాలని అనుకున్నాడట. ఆ బడా హీరో ఎవరో కాదు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని పెద్దోడు పాత్రను డిజైన్ చేశాడట. కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో చివరికి వెంకటేష్ ను తీసుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: