కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా వేదికగా మూవీ టీం ని ప్రశంసించారు.  రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌరీ ఖాన్ సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన 'జవాన్' మూవీ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. షారుఖ్, నయనతార జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. రీసెంట్ గానే జవాన్ రూ.1000 కోట్ల మార్క్ ని 

అందుకున్న విషయం తెలిసిందే.  సినిమాలో డ్యూయల్ రోల్లో షారుక్ స్వాగ్, స్టైల్, యాక్షన్.. ఇలా అన్నిటికీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కాగా ఇప్పటివరకు ఏ సినిమా గురించి మాట్లాడని ఓ స్టార్ హీరో జవాన్ పై మొదటిసారి ప్రశంసలు కురిపించాడు. ఆయన మరెవరో కాదు తలపతి విజయ్. సోషల్ మీడియాలో ఏమాత్రం యాక్టివ్ గా ఉండని విజయ్ ఇప్పటివరకు ఓ సినిమా గురించి కానీ ఓ హీరో గురించి కానీ ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికగా  చెప్పడం జరగలేదు. కానీ మొట్టమొదటిసారి 'జవాన్' సినిమాపై స్పందిస్తూ పలు ఆసక్తికర  పోస్ట్  చేశారు. జవాన్ రిలీజ్ అయిన దగ్గరనుంచి సోషల్ మీడియా వేదికగా సినిమా చూసి ప్రశంశలు కురిపిస్తున్న వారందరికీ షారుక్ ఓపిగ్గా సమాధానం ఇస్తూ ఆకట్టుకున్నాడు.

 ఈ నేపథ్యంలోనే తాజాగా తలపతి విజయ్ ఫ్యాన్స్ 'జవాన్' సినిమా రూ.1000 కోట్లు సాధించడంతో శుభాకాంక్షలు తెలిపారు. దీనికి షారుక్ రిప్లై ఇస్తూ.." మీ విషెస్ కు థాంక్యూ. దళపతి తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐ లవ్ విజయ్ సర్" అంటూ రాస్కొచ్చాడు. ఇక ఈ పోస్ట్   కి స్వయంగా తలపతి విజయ్ రిప్లై ఇస్తూ.." బ్లాక్ బస్టర్ సాధించినందుకు అభినందనలు. అట్లీ, షారుక్ సార్ మరియు చిత్ర బృందానికి.. లవ్ యు టూ షారుక్ సార్" అంటూ పేర్కొన్నాడు. ఈ  పోస్ట్  చూసి షారుఖ్ ఖాన్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో విజయ్ చేసిన ఈ పోస్ట్  నెట్టింట వైరల్ గా మారాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: