
ఇక సీక్వల్ గా వచ్చిన సినిమా కూడా అంతకుమించి అనే రేంజ్ లోనే విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ఒకవైపు హీరో యష్ మరోవైపు పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు అని చెప్పాలి. అయితే కేజిఎఫ్ త్రీ కూడా ఉంటుంది అని ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. సెకండ్ పార్ట్ ఎండింగ్ లో కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని దర్శకుడు ప్రకటించాడు. దీంతో అభిమానులు అందరిలో కూడా ఈ సినిమాపై మరింత ఆత్రుత పెరిగిపోయింది. అయితే సెకండ్ పార్ట్ లో కన్ఫ్లూజన్ లేకుండా ఎండింగ్ వదిలిపెట్టడం వల్ల అభిమానులకు కూడా ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.
అయితే ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీ అయిపోయాడు. దీంతో కేజిఎఫ్ 3 మాటే ఎక్కడ వినిపించడం లేదు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం 2025లో కేజీఎఫ్ తెలుగు సినిమా రిలీజ్ కానుందని హోంబులె ఫిలింస్ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవుతాయని చెప్పుకొచ్చారు. దీనిపై అధికారిక ప్రకటన ఏడాది డిసెంబర్ 21న చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక 2024 అక్టోబర్లో షూటింగ్ మొదలవుతుందని.. 2025 వరకు ఇక ఈ సినిమా థియేటర్లలో చూడొచ్చు అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.