బుల్లితెరపేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ షో కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ప్రతి ఏడాది వరుస సీజన్స్ వస్తున్న కూడా ఏమాత్రం విసుక్కోకుండా చూస్తూనే ఉన్నారు అభిమానులు. ప్రస్తుతం తెలుగులో సీజన్ సెవెన్ చాలా అద్భుతంగా ప్రసారమవుతుంది. అయితే తమిళంలో అక్టోబర్ 1న సీజన్ సెవెన్ ప్రారంభం కాబోతోంది.  ఈసారి 20 మంది కంటెస్టెంట్లు  బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అందులో ఒకప్పటి హీరోయిన్ కూడా ఉంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ మరెవరో కాదు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్న స్టార్ హీరో ప్రభాస్ పక్కన నటించిన హీరోయిన్ కావడంతో దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్ లో జోడి కట్టిన శ్రీదేవి ఇప్పుడు తమిళ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. తల్లి మంజుల తండ్రి విజయకుమార్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈ అందాల తార కెరియర్ ప్రారంభించి మంచి విజయాన్ని అందుకుంది. జయంత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈశ్వర్ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈమెకి ఇదే మొదటి సినిమా. దాని తర్వాత తరుణ్ నిన్నే ఇష్టపడ్డాను ఆర్యన్ రాజేష్ నిరీక్షణ ఆదిలక్ష్మి తో

పాటు కొన్ని సినిమాల్లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక తెలుగులో ఈమె చేసిన చివరి సినిమా 2011 వచ్చిన సెల్ఫోన్ సినిమా. దాని తర్వాత కన్నడలో 2016లో లక్ష్మి సినిమా చేసి అక్కడి ఇండస్ట్రీ కి గుడ్ బై చంపేసింది. ప్రస్తుతం బుల్లితరపై జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఈమె తమిళ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకే తమిళ బిగ్ బాస్ 3 సీజన్లలో శ్రీదేవి సోదరి వనిత విజయ్ కుమార్ పాల్గొని  రెండవ వారం షో నుండి ఎలిమినేట్ అయింది. శ్రీదేవి వనిత విజయ్ కుమార్ మరొక సిస్టర్ ప్రీతి ఈమె సైతం శివాజీ హీరోగా వచ్చిన వైఫ్ సినిమాలో హీరోయిన్ గా మెప్పించింది. ప్రీతీ మరెవరో కాదు తమిళ స్టార్ డైరెక్టర్ సింగం హరి కి భార్య. అలా ఇప్పుడు తమిళ బిగ్ బాస్ లోకి ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వడంతో ఈ వార్తలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: