బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి ఇప్పటికీ  నాలుగు వారాలు అవుతోంది. ఇప్పుడు దాకా మొత్తం మూడు ఎలిమినేషన్స్ పూర్తయ్యాయి. అయితే ఈ మూడు ఎలిమినేషన్స్లో బయటికి వెళ్లిపోయింది లేడీ కంటెస్టెంట్సే.అలాగే నాలుగో వారం కూడా మరో లేడీ కంటెస్టెంటే ఎలిమినేట్ అవ్వనుంది. దీంతో బిగ్ బాస్ హౌజ్లో అమ్మాయిల సంఖ్యకు ఇంకా అబ్బాయిల సంఖ్యకు చాలా తేడా రానుంది.ఈ బిగ్ బాస్ సీజన్ 7లో మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో ఏడుగురు మగవారు, ఏడుగురు ఆడవాళ్లు వున్నారు. తాజాగా జరిగే ఎలిమినేషన్తో మరో లేడీ కంటెస్టెంట్ వెళ్లిపోగా.. ఇంకా ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే మిగులుతారు. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాత్రం ఖచ్చితంగా జనాలు వేసే ఓట్లు బట్టే ఉంటుంది. జనాలని సరిగ్గా మెప్పించలేకపోతే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎలిమినేట్ అవ్వాల్సిందే.ఈసారి బిగ్ బాస్ నుండి రతిక అనే అమ్మాయి ఎలిమినేట్ అయ్యింది. రతిక హౌజలోకి ఎంటర్ అయినప్పటి నుండి చాలా వరకు ప్రేక్షకులు అందంగా ఉంది అనిపించేలా తప్పా బాగా ఆడుతుంది అనిపించేలా ఆమె అస్సలు ఒక్క పని కూడా చేయలేదు.


టాస్కుల విషయంలో రతిక.. ఎప్పుడూ చురుగ్గా ఉండేది కాదు.అలాగే ఇంట్లో పనులు కూడా సరిగ్గా చేసేది కాదు. ఎప్పుడు చూసినా ఎదో ఒకటి తింటూ ఉంటుంది. ఒక్క పని కూడా చెయ్యదు. అలాగే అందరి దగ్గర ఫ్లిప్ అవుతుంది. ఈమె ఆట చూసిన ప్రేక్షకులు బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈమెని హేట్ చేస్తున్నారు. ఇలాంటి చెత్త కంటెన్స్టంట్ ని చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. యూట్యూబ్ లో బిగ్ బాస్ ప్రోమోస్ ఇంకా సోషల్ మీడియా పోల్స్ లో ఈ రతిక ఎలిమినేట్ అవ్వాలని ఆడియన్స్ విపరీతంగా కోరుకుంటున్నారు. అలా కోరుకున్నట్టే ఆమె ఎలిమినేట్ అయిపోయింది.ఇక ఓ నామినేషన్స్ సమయంలో ప్రశాంత్ ప్రవర్తనను తప్పుబట్టడం మొదలుపెట్టింది. ఆ నామినేషన్స్ వల్ల ప్రేక్షకుల్లో ప్రశాంత్పై రతికపైనే నెగిటివిటీ ఎక్కువగా పెరిగిపోయింది. ఆ తరువాత ప్రశాంత్ తన పని తాను చేసుకుంటే అతన్ని టార్గెట్ చేసింది.అలాగే శివాజీ, యావర్ విషయంలో కూడా చాలా దారుణంగా ప్రవర్తించింది. మొన్న ఒక టాస్కులో ప్రశాంత్, యావర్ కుటుంబాల గురించి తప్పుగా మాట్లాడింది. అందుకే ఆమెని జనాలు ఎలిమినేట్ చేసి తగిన బుద్ధి చెప్పారు. ఇక ఆమె కెరీర్ పరంగా ముందుకు వెళ్లడం కూడా కష్టం అనే చెప్పాలి. సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: