తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న వారిలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన తన కెరీర్ లో ఇప్పటి వరకు అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో అనేక మూవీ లు సూపర్ సక్సెస్ లను కూడా అందుకున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఈ దర్శకుడు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ అందులో ఏ సినిమా కూడా కాస్త క్లాస్ మూవీ కూడా లేకపోవడం విశేషం. ఈ దర్శకుడు ఏ సినిమా రూపొందించిన అందులో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ ఉండాల్సిందే. రక్తం చెందాల్సిందే.

అంతటి స్థాయిలో మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న ఈయన తాజాగా రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా స్కంద అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో కూడా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ... భారీ రక్తపాతం కూడా ఉంది. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో తెలుగు లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అయినటువంటి శ్రావణ్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

ఇక తాజాగా ఈ మూవీ యూనిట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా శ్రావణ్ మాట్లాడుతూ ... నేను ఏఎంబి థియేటర్ లో స్కంద మూవీ కి వెళ్లాను. అందులో భాగంగా సినిమా మొత్తం పూర్తి అయ్యాక సీట్ లో నుంచి ఇద్దరు వ్యక్తులు లేచి బోయపాటి గారి పేరు పడగానే దండం పెట్టారు. దానితోనే నేను వెంటనే బోయపాటి గారికి ఫోన్ చేసి మనం హిట్ కొట్టేశాం సార్ అని చెప్పేసాను.

మరింత సమాచారం తెలుసుకోండి: