తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం వారిసు మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ నటుడు ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ మూవీ విడుదల కాకముందే విజయ్ తన తదుపరి మూవీ ని ఓకే చేసుకున్నాడు.

విజయ్ తన తదుపరి మూవీ ని తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడు తాజాగా నాగ చైతన్య హీరోగా రూపొందిన కస్టడీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇకపోతే విజయ్ , వెంకట్ కాంబో మూవీ కి సంబంధించిన క్రేజీ వివరాలు తెలుసుకుందాం. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించనుండగా ... ఏజిఎస్ సినిమాస్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించనుండగా ... ఈ సినిమాని తాజాగా ప్రారంభించారు.

ఇకపోతే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా తో పాటు ఎస్ ఎస్ తమను కూడా సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: