
అది కూడా హీరోయిన్ సాయి పల్లవి ఈ చిత్రంలో భాగం కాబోతున్నట్లు సమాచారం. రామాయణంలో సాయి పల్లవి సీత పాత్రను పోషించబోతోంది అంటూ రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తాడంటూ.. రావణుడి పాత్రలో యశ్ పేరు వినిపిస్తోంది. కానీ ఈ విషయం పైన ఇంతవరకు ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు.. సాయి పల్లవి వంటి గొప్ప యాక్టర్ సీతాపాత్ర లో నటిస్తే ఆ క్యారెక్టర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్తుందని అభిమానులు భావిస్తున్నారు. రణబీర్ కపూర్ కూడా రాముడు పాత్రకు బాగానే సూట్ అవుతారని చెప్పవచ్చు.
ఇక కే జి ఎఫ్ హీరో యశ్ రావణుడి పాత్రలో కనిపిస్తే చాలా స్పెషల్ గా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇదంతా వినడానికి చాలా ఆసక్తికరంగా అనిపించిన రామాయణం గాధ తెరకెక్కించిన అది పురుష్ సినిమా ఇటీవలే విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమా అయ్యి కూడా ప్రభాస్ కు నిరుత్సాహాన్ని మిగిల్చింది. అలాంటిది ఇప్పుడు రామాయణం స్టోరీని తీస్తున్నారు అంటే కథ లో కచ్చితంగా బలం ఉంటే సరిపోతుంది సరిగ్గా ఈ సినిమా తీస్తే మంచి ఫలితమే రాబడుతుంది కానీ ఎంతకాలం ఈ సినిమా వార్తలకే పరిమితం అవుతుందో చూడాలి మరి ఈ విషయం పైన చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇస్తుందేమో తెలియాల్సి ఉంది.