సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం అనే సినిమాలో మహేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయమే ఉన్న ఇప్పటికే ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే మహేష్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లను మిస్ కూడా చేసుకున్నాడు. అలా మహేష్ మిస్ చేసుకున్న ఒక బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం ఇప్పటికే విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోతే ఈ మూవీ యొక్క కథను మొదటగా సుకుమార్ , మహేష్ కి వినిపించాడట. మహేష్ కి కూడా ఈ సినిమా కథ సూపర్ గా నచ్చినప్పటికీ ఆ సమయంలో మహేష్ ఇతర మూవీ లతో బిజీగా ఉండడంతో ఈ మూవీ చేయలేను అని సుకుమార్ కు చాలా సున్నితంగా చెప్పాడట.

దానితో సుకుమార్ ఈ కథను అల్లు అర్జున్ కు వినిపించగా ఆయనకు ఈ కథ హైలెట్ గా నచ్చడంతో వెంటనే ఈ సినిమాను అల్లు అర్జున్ తో తెరకెక్కించాడట. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ లోని తన నటనతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. పుష్ప పార్ట్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: