
గత కొన్నాళ్లుగా రామాయణాన్ని మళ్ళీ చిత్రీకరించాలని ఆలోచనలో ఉంది బాలీవుడ్. ఆదిపురుష్ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అవ్వడమే కాకుండా, ఎన్నో వివాదాలకు దారి తీసింది. ఐతే ఈసారి తగు జాగ్రత్తలు తీసుకొని పగడ్బందీగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీనికి తగ్గ కాస్ట్ ను కూడా ఫైనల్ చేసారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రాముడిగా రన్బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో రావణుడిగా యాష్ నటించబోతున్నారు. గతంలో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన నితీష్ తివారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కాబోతోంది. 2024 జూన్ లో యాష్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆదిపురుష్ చిత్రం విఫలం అవ్వడానికి ముఖ్య కారణం వీఎఫ్ఎక్స్. అందుకే ఈ చిత్రానికి నితీష్ తివారి ఆస్కార్ విన్నింగ్ వీఎఫ్ఎక్స్ టీం ను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్....ఇలా అన్ని విభాగాలకు భారతదేశంలో అత్యున్నత టెక్నిషియన్స్ ను ఈ ప్రాజెక్ట్ కు ఉపయోగించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించారు మేకర్స్. మొదటి భాగంలో రావణుడి సన్నివేశాలు తక్కువగా ఉండటంవలను యాష్ కేవలం 15 నుంచి 20 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం.