గత కొన్ని ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ షో లో యాంకర్లుగా తమకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు యాంకర్ రష్మీ అనసూయ. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త ఎంతో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు జబర్దస్త్ లో యాంకర్ గా వ్యవహరించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రష్మీ ఇప్పుడు యాంకర్ పోస్ట్ నుండి తప్పుకుంటుంది అన్న వార్తలు వినబడుతున్నాయి.  ముఖ్యంగా యాంకర్ అనసూయ తప్పుకున్న తర్వాత నుండి జబర్దస్త్ 

షో రేటింగ్ పూర్తిగా పడిపోయింది అని అంటున్నారు. యాంకర్ అనసూయ ఈ షో నుండి తప్పుకున్న తర్వాత తన ప్లేస్ లోకి సౌమ్య వచ్చింది. అయినప్పటికీ తన ప్లేస్ ను రీప్లేస్ చేయలేకపోయింది సౌమ్య. అంతేకాకుండా రష్మీ ఎంత ట్రై చేసినా కూడా అనసూయ స్థానాన్ని అందుకోవడంలో విఫలమవుతోంది. దాంతో ఇప్పుడు రష్మీ రెమ్యూనరేషన్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పూర్తిగా తగ్గించేసింది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇన్నాళ్లు జబర్దస్త్ షో కోసం కష్టపడిన తనకి తక్కువ రెమ్యూనరేషన్ 

ఇస్తూ సౌమ్యకి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడంతో ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యిందట రష్మీ. అందుకే ఈ షో నుండి తప్పుకోవాలి అని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక అగ్రిమెంట్ ప్రకారం ఈ షో నుండి తప్పుకోబోతున్నట్లుగా కూడా ఇప్పటికే రష్మీ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని టాప్ చానల్స్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ షో లో యాంకర్లుగా తమకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న  రష్మీను తమ ఛానల్ లో భాగం చేసుకోవాలి అని చూస్తున్నారు. కానీ ఈ విషయంలో రష్మీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: