మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్ గా సినీ ఇండస్ట్రీకి వచ్చిన  తర్వాత కొన్ని సినిమాల్లో నటించి హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో పెంచింది. సినిమాల్లో బిజీగా ఉన్న నిహారిక చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొన్ని రోజులు బాగానే ఉంది. ఇక వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. కొన్ని నెలల కిందట ఇద్దరు ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిహారిక ఎప్పుడైతే విడాకులు తీసుకుందో అప్పటినుండి

తనకి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అలా నిహారిక తన మాజీ భర్తని మర్చిపోవడానికి రకరకాల పనులు చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అలా నిహారిక వెకేషన్ కోసం ఆఫ్రికా వెళ్ళింది అని దాని తర్వాత అమెరికాకు వెళ్ళింది అని అంటున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో ఆ ఫొటోస్ అన్నీ ట్రోల్స్ కి గురవుతున్నాయి. వీటన్నిటి నుండి ఒక విరామం తీసుకోవాలి అని తన మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి నిహారిక విదేశాలకు వెళ్ళింది

అని చాలామంది అంటున్నారు. ఇటీవల నాగబాబు ఇంట్లో వినాయక చవితి పూజ చేశారు. అందులో మెగా కోడలు లావణ్య త్రిపాఠి సైతం మెరిసింది. కానీ నిహారిక మాత్రం లేదు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక మాజీ భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు అని అంటున్నారు. కానీ దానిపై ఎటువంటి స్పష్టత లేదు. ఇటు నిహారిక సైతం సినీ హీరోని వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇందులో కూడా ఎటువంటి నిజం లేదు. ఈ క్రమంలోనే నిహారిక కొన్నాళ్లపాటు అన్నిటికీ బ్రేక్ ఇచ్చి కొందరి నా జీవించాలి అని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే నిహారిక తన మాజీ భర్తను మరచిపోవడం కోసం ఒక కుక్కని పెంచుకుంటుంది అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: