
ఈ క్రమంలోనే తనదైన స్ట్రాటజీలతో అద్భుతమైన ఆటతో అటు ప్రేక్షకులను అలరిస్తూ ఎలిమినేషన్స్ దాటుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్గా నిలిచిన అఖిల్ సార్ధక్ పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇలా ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్ ను సపోర్ట్ చేస్తూ అఖిల్ సార్ధక్ పలు వీడియోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ క్రమంలోనే కొంతమంది నేటిజన్స్ అఖిల్ పై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇదే విషయం గురించి ఈ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ట్రోల్స్ చేస్తున్న వారందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్పాడు అఖిల్ సార్ధక్. మీకు దమ్ముంటే హౌస్ లోకి వెళ్లి మీ టాలెంట్ చూపించండి అంటూ సవాల్ విసిరాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్ హౌస్ లో ఉన్నప్పుడు ఎన్నో చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. నాపై ట్రోల్స్ చేస్తున్న వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నాకు ఫ్రీగా ఒక పబ్లిసిటీ ఇస్తున్నారు. నాపై నెగటివ్ కామెంట్స్ చేసే వారిని స్పెషల్ థాంక్స్ ఇవ్వన్ని నేను ఇప్పటికే చాలా చూశాను. ఇలాంటివి అస్సలు పట్టించుకోను. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన రన్నర్ ఆఫ్ అయినా ఎంతగానో సంతోషిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ హౌస్ లోకి గేమ్ క్లియర్ గా ఆడుతున్నాడు. మీ పబ్లిసిటీ మీరు చేసుకోండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ చెప్పుకొచ్చాడు అఖిల్.