ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారుతున్న విషయం ఏమిటంటే హీరోయిన్ రీతు వర్మ త్వరలోనే ఈమె కూడా మెగా ఇంటి కోడలు కాబోతుందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమను చాలా గుట్టుగా మెయింటైన్ చేస్తూ చివరికి తామిద్దరం ప్రేమించుకున్నామని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ఎంగేజ్మెంట్ చేసుకొని షాకిచ్చారు. త్వరలోనే భార్యాభర్తలుగా వీరిద్దరూ కాబోతున్నారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్ రీతు వర్మ కూడా ఎక్కువగా మెగా ఫ్యామిలీలో ఎక్కువగా కనిపిస్తోంది.


ముఖ్యంగా అసలు సంబంధంలేని కుటుంబానికి ఈమె పార్టీలో పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే రీతు వర్మ మెగా హీరోని లవ్ చేస్తోందని వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి త్వరలోనే రీతు వర్మ కూడా మెగా కోడలు కాబోతోంది అనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే రీతు వర్మ మాత్రం ఎవరిని లవ్ చేస్తోంది అనే విషయంపై ఇంకా అభిమానులు సందిగ్ధంగానే ఉన్నారు. మరి అసలు విషయం ఏంటనే విషయంపై రీతు వర్మ కాని మెగా కుటుంబం కాని క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెగా అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఉన్నారు.


ఇటీవలే లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్ ఫ్రీ వెడ్డింగ్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి ఇంట్లో ఈ ఫోటోలను గడిచిన కొద్ది రోజుల క్రితం తీయడం జరిగింది అయితే ఈ నిన్నటి రోజున అల్లు అర్జున్ ఇంట్లో కూడా ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలను సైతం తీసినట్టుగా పలు రకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇందులో రీతు వర్మ కనిపించడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది లావణ్య త్రిపాఠి స్నేహితురాలు అయి ఉండొచ్చు కదా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా నిజం తెలియాలి అంటే మరొక కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: