జగదీకవీరుడు అతిలోక సుందరి’ సినిమా స్థాయిలో మరో ఫ్యాంటసీ మూవీ చిరంజీవి నుండి వస్తే చూడాలని చాలామంది ఎప్పటి నుండో ఆశిస్తున్నారు. అయితే ఆ ఆశ ఇప్పుడు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. ‘బింబిసార’ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన దర్శకుడు వశిష్ట పంచభూతాల కాన్సెప్ట్ తో నిర్మిస్తున్న మూవీ పూజా కార్యక్రమాలు విజయదశమి రోజున అత్యంత ఘనంగా జరిగాయి.



ఈమూవీని భారీ బడ్జెట్ తో తీసి వచ్చే దసరా కు విడుదల చేయాలి అన్న ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమూవీకి ‘విశ్వంభర’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘విశ్వంభర’ పేరుతో సుప్రసిద్ధ రచయిత డాక్టర్ సి నారాయణరెడ్డి వ్రాసిన కావ్యానికి జ్ఞానపీఠం అవార్డు కూడ వచ్చింది. విశ్వజనీతమైన శక్తిని పొంది పంచ భూతాలను శాసించే బలం ఉన్న వాడికి ఉపమానంగా దీన్ని వాడుతూ ఉంటారు.



అలాంటి పవర్ ఫుల్ టైటిల్ ఈసినిమాకి పెడుతున్నట్లు సమాచారం. ఈమధ్య కాలంలో తెలుగు సినిమాలకు సంస్కృత టైటిల్స్ పెడితే వెంటనే జనంలోకి వెళ్ళిపోతున్నాయి. యంగ్ హీరో నిఖిల్ ‘స్వయంభు’ కోసం ఇప్పటికే చాల కష్టపడుతున్నాడు. నిఖిల్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా ఇది. ‘కార్తికేయ 2’ మూవీలా ఈమూవీ తనకు మరింత పేరు తెచ్చి పెడుతుందని నిఖిల్ భావిస్తున్నాడు.



ఇలా టాప్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు ప్ఫ్యాంటసీ సినిమా లపై మోజు పడుతూ వారి సినిమాలకు సంస్కృతంలో టైటిల్స్ పెట్టి త్వరగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాళాని చాల  ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న ఈ ‘విశ్వంభర’ ఎంతవరకు మెగా స్టార్ పాన్ ఇండియా కలలను నెరవేరుస్తుందో చూడాలి. ఈమూవీ భారీ గ్రాఫిక్స్ తో కూడుకున్న నేపధ్యంలో వచ్చే సంవత్సరం దసరా కు కుదరకపోతే 2025 సంక్రాంతి రేస్ లో ఈమూవీని విడుదల చేసి రికార్డులు క్రియేట్ చేయాలని భావిస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: