నందమూరి నట సింహం బాలకృష్ణ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. వీరు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఏమిటి..? ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ణ "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఊటీలో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వి కపూర్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు మైసూర్ లో రామ్ చరణ్ మరియు అంజలి పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: