తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఈ సంవత్సరం ప్రారంభంలో వారిసు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయం అందుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత ఈ సంవత్సరం విజయ్ ... లోకేష్ కనకరాజు దర్శకత్వంలో త్రిష హీరోయిన్ గా రూపొందిన లియో అనే మూవీ తో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ విజయ్ కెరియర్ లో 68 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ను తలపతి 68 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించబోతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తలపతి 68 మూవీ లో లైవ్ టుడే మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఇవానా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ... ఈ ముద్దుగుమ్మ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉండబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. మరి ఈ వార్తకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: