సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజ కాంబినేషన్లో ఒక సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది. సన్ పిక్చర్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకన్నాయి. అయితే ఈ రేంజ్ క్రేజ్ అనౌన్స్మెంట్ తోనే మరొక సినిమాకి రాదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కోడ్ రెడ్ అనే టైటిల్ను ఈ సినిమాకి పెట్టబోతున్నారు అని కోలీవుడ్లో వార్తలు వినబడుతున్నాయి. కానీ లోకేష్ మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

 కోడ్ రెడ్ టైటిల్ పెట్టి రజినీకాంత్ ను ఇందులో గ్యాంగ్ స్టార్ గా చూపిస్తే మాత్రం తలైవర్ 171 సినిమా కోలీవుడ్ నుండి మొదటి 1000 కోట్ల కలెక్ట్ చేసే సినిమా కావడం ఖాయమని అంటున్నారు. ఇక రజనీకాంత్ లోని నెగిటివ్ షేడ్ యాక్టింగ్ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ షేడ్ ను కంప్లీట్ గా టచ్ చేస్తున్నాను అంటూ లోకేష్ ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చాడు. అందుకే తలైవర్ 171 సినిమా పక్కాగా యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉంటుంది అని అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక  లోకేష్… తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి పక్కకి వచ్చి చేస్తున్న ఈ సినిమాలో

 సాలిడ్ కాస్టింగ్ ఉంటుందట. తలైవర్ 171 కాస్టింగ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. రజినీకాంత్ కోసం శివ కార్తికేయన్ ని రంగంలోకి దించాడట లోకేష్ కనగరాజ్. ఇప్పటికే శివ కార్తికేయన్ తో అగ్రీమెంట్స్ కూడా కంప్లీట్ అయ్యాయని సమాచారం. కోలీవుడ్ లో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శివ కార్తికేయన్… జైలర్ సినిమాలోనే రజినీకాంత్ కి కొడుకుగా నటించాల్సి ఉంది కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఈసరి మాత్రం రజినీకాంత్-శివ కార్తికేయన్ కాంబినేషన్ మిస్ అయ్యేలా కనిపించట్లేదు. ఇక ఈ విషయంపై క్లారిటీ రావాలి అంటే సన్ పిక్చర్స్ నుండి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: