
దీంతో కాంతారా సినిమా సీక్వెల్ రాబోతోంది అంటూ గతంలో ఎక్కువగా జోరుగా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కాంతారా సినిమాకు సీక్వెల్ కాదు ఫ్రీక్వెల్ రాబోతోంది అంటూ చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా నుండి గత రెండు రోజుల క్రితం ఒక క్రేజీ అప్డేట్ ను సైతం చిత్ర బృందం విడుదల చేశారు. కాంతార-2 చిత్రంలో రిషబ్ శెట్టి లుక్ అందరినీ ఆకట్టుకునేలా చేశాయి. ఎంతగానో ఎదురు చూస్తున్న చాప్టర్-1 క్రేజీ లుక్స్ కు ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడం జరిగింది.
అయితే కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి భార్య ప్రగతి శెట్టి కూడా చిన్న పాత్రలో కనిపించబోతోందని సమాచారం. నవంబర్ 27న ఆడేగుడ్డే శ్రీ వినాయక దేవాలయంలో ఈ ఫ్రీక్వెన్ ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రగతి శెట్టి మీడియాతో మాట్లాడుతూ గతసారి లాగానే ఈసారి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయబోతున్నానని నేను ఎప్పుడు రిషబ్ శెట్టి తోనే ఉంటాను ఈ చిత్రంలో తన పాత్ర ఉందా లేదా అనేది ఇప్పటికీ తెలియదు.. ఏదైనా త్వరలోనే చెబుతాను. అంటూ తెలియజేశారు. దీంతో కచ్చితంగా ఈమె నటించబోతోంది అంటూ అభిమానుల సైతం తెలియజేస్తున్నారు.