తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో తల్లిగా పిన్నిగా అత్తగా పలు పాత్రలలో నటించి మంచి గుర్తింపు సంపాదించు కున్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులలో నటి ప్రగతి కూడా ఒకరు.. ఈమె సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి మంచి సినిమాలలో నటిస్తూ భారీ విజయాలను అందుకుంటోంది. కరోనా సమయంలో సోషల్ మీడియాలో అడుగుపెట్టిన ప్రగతి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పలు రకాల వీడియో డాన్స్ లతో సందడి చేసిన ప్రగతి నిరంతరం జిమ్ వర్కౌట్ వీడియోలతో ఎక్కువ సమయాన్ని గడిపేస్తూ ఉంటుంది.


ప్రగతి జిమ్లో భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ వర్కౌట్ కు సంబంధించిన ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ తెగ సందడి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ లో భాగంగా చీరకట్టులో కూడా చాలా బరువులను ఎత్తుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.. 40 ఏళ్లలో కూడా తన ఫిట్నెస్తో తాజాగా ప్రగతి ఒక  ఆరుదైన రికార్డును సైతం సృష్టించినట్లు  తెలుస్తోంది. వెయిట్ లిఫ్టింగ్  ఎంతో అనుభవం ఉన్నటువంటి ఈమెకు తాజాగా కాంస్య పథకం గెలుచుకున్నట్లుగా తెలుస్తున్నది.. నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ పోటీలు బెంగళూరులో జరగడం జరిగిందట ఇందులో కేవలం ఉమెన్స్ మాత్రమే పాల్గొనడం జరిగింది.


అక్కడే ఒక ప్రొఫెషనల్ తో పోటీపడి మరి ప్రగతి  కాంస్యం గెలుచుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె పంచుకోవడం జరిగింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నటి ప్రగతిని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ మెచ్చుకుంటున్నారు. ప్రగతికి వెయిట్ లిఫ్టింగ్ అంటే ఎంత ఇష్టమో అంటూ పలువురు నెటిజన్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రగతి సినిమాలను తగ్గించి మరి ఇలాంటి వాటిపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇలాంటి పథకాలు సాధించాలి అంటే అది చాలా అరుదైన విషయమని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: