సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అందులో నేహా షెట్టి పోషించిన రాధికా పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు అదే పేరుతో dj టిల్లు సీక్వెల్ లో సాంగ్ రిలీజ్ అయింది. dj టిల్లు మూవీకి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ నుంచి ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ 'టికెట్టే కొనకుండా' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. రామ్ మిర్యాల పాడిన ఈ పాటలో సిద్దు, అనుపమల మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 

ఈ ఒక్క సాంగ్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట కూడా సినీ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉంది. 'రాధిక' అంటూ సాగే ఈ పాటలో మరోసారి అనుపమ పరమేశ్వరన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.." రాధికా.. రాధిక.. ముందుకా, వెనకకా.. కిందకా మీదకా.. అంటూ షురూ అయిన ఈ సాంగ్ ని రామ్ మిర్యాల ఫుల్ జోష్ తో పాడారు. క్యాచీ లిరిక్స్, ఫాస్ట్ బీట్ తో సాగిన ఈ పాట సినీ లవర్స్ ని ఉర్రూతలూగించడం ఖాయం అని చెప్పవచ్చు. డీజే టిల్లు మూవీలో రాధిక పేరు ఓ బ్రాండ్ లా మారిపోయింది. 

అదే పేరుతో వచ్చిన ఈ సాంగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'టిక్కెట్టే కొనకుండా' అంటూ గతంలో వచ్చిన ఫస్ట్ సింగిల్ ఎంత పాపులర్ అయిందో ఈ రాధిక సాంగ్ కూడా అంతే పాపులర్ అవుతుంది. ముఖ్యంగా యూత్ ఈ సాంగ్ కి బాగా కనెక్ట్ అవుతారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటని రామ్ మిర్యాల కంపోజ్ చేయడంతో పాటు స్వయంగా పాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ పాట రాబోయే రోజుల్లోనే ఈ ఇయర్ టాప్ టెన్ చార్ట్ బస్టర్ సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: