వరుసగా మూడు సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. స్టార్ హీరో బాలకృష్ణ కు అలాంటి అదృష్టం ఉంది. బాలయ్య సినిమాలు వరుస గా బ్లాక్ బస్టర్ హిట్లు కాగా బాలయ్య 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడానికి ఎంతో సమయం లేదని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.2024 సంవత్సరంలో 100 కోట్ల రూపాయల షేర్ కలను సైతం బాలయ్య తీర్చుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది విశ్లేషకులు బ్రాహ్మణి పుట్టిన తర్వాతే బాలయ్యకు సినీ కెరీర్ పరంగా కలిసొచ్చిందని చెబుతారు. బ్రాహ్మణి పుట్టక ముందు కూడా బాలయ్య విజయాలు సాధించినా బ్రాహ్మణి పుట్టిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు దక్కాయని సినిమా ఇండస్ట్రీ లో టాక్ ఉంది. బ్రాహ్మణి జాతకం మంచి జాతకం అని ఆమె వల్ల కుటుంబ సభ్యులకు కష్టాలు తగ్గే అవకాశం తో పాటు అనుకూల ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.

బాలయ్య ప్రస్తుతం పొలిటికల్ కెరీర్ కంటే సినీ కెరీర్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. 2024 సంవత్సరం ఎన్నికల సమయానికే బాబీ మూవీని రిలీజ్ చేయాలని బాలయ్య ప్లాన్ అని తెలుస్తోంది. బాబీ మూవీలో బాలయ్య లుక్ కూడా కొత్తగా ఉండనుందని సమాచారం అందుతోంది. కథల విషయంలో బాలయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా సినిమాల ఫలితాల విషయంలో ఆయన అంచనాలు తప్పడం లేదు.బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కనున్న అఖండ2 మూవీ కూడా ఘనవిజయం సాధించి మంచి లాభాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. బాలయ్య సినిమాలన్నీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. సినిమా సినిమా కు బాలయ్య రేంజ్ ఊహించని స్థాయి లో పెరుగుతోండగా ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: