
అయితే కేడి సినిమాకి దర్శకత్వం బాలేదు అని అప్పట్లో ఒక టాక్ వినిపించింది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా చేసిన కిరణ్ కుమార్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న సందీప్ రెడ్డి వంగ చేశారట. అయితే డైరెక్టర్ కిరణ్ కుమార్ లేని చాలా సమయాల్లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చేశారట. డైరెక్టర్ లేని సమయంలో చాలా వరకు షూటింగ్ అయిన కానిచ్చేశారని తెలుస్తోంది. ఇక నాగార్జున కేడి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడమే కాదు ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా సందీప్ రెడ్డి వంగా కనిపించారు. అలా ఈ సినిమా ప్లాఫ్ అవ్వడంలో సందీప్ రెడ్డి బాగమయ్యారు. ఇక అప్పటివరకు ఎంతో అద్భుతంగా ఉన్న నాగార్జున సినీ కెరీర్ ఈ ఒక్క సినిమాతో మొత్తం తలకిందులుగా మారిపోయింది .