తమిళ ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల త్రిష పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మెగాస్టార్ చిరంజీవి స్పందించిన  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ తమిళ మీడియాలో చిరంజీవి పై మన్సూర్ అలీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. త్రిషపై మీరు చేసిన వ్యాఖ్యలను చిరంజీవి ఖండిస్తూ వక్రబుద్ధితో ప్రవర్తించారని చెబితే అందుకు మన్సూర్ అలీ బదులిస్తూ.." ఎవరిది వక్ర బుద్ధి, చిరంజీవి పార్టీ పెట్టి వేల కోట్లు మింగాడు. కానీ పేదవాళ్ళకి ఒక్కరికి కూడా సహాయం చేయలేదు. 

ఆ డబ్బులు అంతా తన అవసరానికి వాడుకున్నాడు తప్పితే పేదవాళ్ళకి హెల్ప్ చేయలేదు. నేను చిరంజీవి, త్రిష, కుష్బూ ముగ్గురి మీద పరువు నష్టం దావా వేశాను. అందులో చిరంజీవి మీద రూ.20 కోట్లు త్రిష,ఖుష్బూ మీద చెరో రూ.10 కోట్ల పరువు నష్టం దేవా వేశాను. ఆ వచ్చిన డబ్బును తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకి ఇస్తాను. ఇది నా ప్రామిస్. నిజానికి ఈ విషయంలో చిరంజీవి గారే తప్పు చేశారు. ఏం జరిగిందో ఆయన ముందు తెలుసుకోవాలి. నన్ను అడగాలి. ఫోన్ చేసి ఏం జరిగిందనేది అడగకుండా ఆయన అలా అనడం తప్పు" అంటూ చెప్పుకొచ్చాడు. 

దీంతో మెగాస్టార్ పై చేసిన కామెంట్స్ కి మన్సూర్ అలీపై మెగా ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్సూర్ చిరంజీవిని కావాలనే టార్గెట్ చేస్తున్నాడని, అతను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవాలు లేవని, అవన్నీ పనికిరాని కామెంట్స్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు చిరంజీవి  స్పందిస్తూ.." మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు ఏ స్త్రీని అనడానికి అయినా అసహ్యంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: