ప్రతి సంవత్సరం చాలా మంది దర్శకులు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో చాలా తక్కువ మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొట్ట మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను అందుకొని ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను ... గుర్తింపును సంపాదించుకుంటారు. అలా దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని ... మంచి గుర్తింపును ... అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన అర్జున్ రెడ్డి మూవీ.తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని క్రేజ్ ను సంపాదించుకున్నాడు. 

ఇక ఆ తర్వాత ఈయన ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమిక్ చేసి ఈ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన యానిమల్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. రన్బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 1 వ తేదీన విడుదల కాబోతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేశారు. ఈ మూవీ ని ఏకంగా 3 గంటల 21 నిమిషాల 16 సెకండ్ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇంత రన్ టైమ్ తో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చాలా మంది ఈ సినిమా ఏమైనా విసుకు తెప్పిస్తుందా అనే అంశాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక దానితో సందీప్ కూడా ఈ సినిమా మీకు ఏ మాత్రం బోరు కొట్టించదు అని పలు సందర్భాలను చెప్పాడు. ఇకపోతే తాజాగా ఈయన ఈ మూవీ రన్ రన్ గురించి మాట్లాడుతూ ... ఈ మూవీ కథను నిర్మాతలకు చెప్పినప్పుడే ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది అని చెప్పాను దానికి వారు ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలియజేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: