సూపర్ స్టార్ రజనీ కాంత్ మరికొన్ని రోజుల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ మూవీ రజిని కెరియర్ లో 171 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాని "తలైవార్ 171" అనే వర్కింగ్ టైటిల్ తో కొన్ని రోజుల క్రితమే అధికారికంగా లాంచ్ చేశారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఆ పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పే పాత్రగా అది ఉండనున్నట్లు సమాచారం. అలాంటి కీలకమైన పాత్రలో ఒక మంచి క్రేజ్ ఉన్న నటుడిని తీసుకోవాలి అనే ఉద్దేశంలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఈ పాత్ర కోసం తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ ను సంప్రదించగా ఆయన కూడా ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే శివ కార్తికేయన్ ప్రస్తుతం ఆయలన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే రజనీ కాంత్ తాజాగా లాల్ సలాం అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: