యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఆఖరుగా ఎన్టీఆర్ ... రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తో ఎన్టీఆర్ గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ...ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు అని అఫీషియల్ ప్రకటన వచ్చినప్పటి నుండి ఈ మూవీ ఆల్బమ్ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఆ అంచనాలకు తగినట్టుగానే అనురుధ్ కూడా ఇప్పటికే ఈ సినిమాకు కొన్ని అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కోసం అనిరుద్ రెండు అదిరిపోయే ఊర మాస్ డాన్స్ మూమెంట్స్ ఉండే విధంగా ట్యూన్స్ ఇచ్చినట్లు ఇందులో ఎన్టీఆర్ కూడా అదిరిపోయే డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వార్త కనుక నిజం అయితే ఈ రెండు పాటలతో థియేటర్ లలో రచ్చ రచ్చ అయ్యే అవకాశం ఉన్నట్లే అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: