ఈ ఏడాది వచ్చిన షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. 'పఠాన్' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత షారుఖ్ ఖాన్ కి మరో వెయ్యి కోట్ల సినిమాని అందించింది 'జవాన్'.ఈ మూవీలో నయనతారతో పాటు దీపికా పదుకోనె కూడా ముఖ్య పాత్ర పోషించింది. షారుఖ్ ఖాన్ దీపికా కాంబినేషన్ అనేసరికి ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉంటాయి. వీళ్లది హిట్ పెయిర్ కాబట్టి.. ఈ కాంబోలో రొమాంటిక్ సీన్స్ ను ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు.దానిని అట్లీ క్యాష్ చేసుకొని వీరి మధ్య డిఫరెంట్ లవ్ ట్రాక్ ను పెట్టాడు. మెయిన్ గా కుస్తీ సీన్ పెట్టి వీరి మధ్య రొమాన్స్ అనేది బాగా పండేలా చేశాడు. ఆ సీన్ క్లాస్, మాస్ ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే  ‘డంకి’ సినిమాలో  ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నాడు షారుఖ్ ఖాన్.


తాజాగా రిలీజ్ అయిన 'లుట్ పుట్ గయా..' అనే సాంగ్‌ను 'డంకీ డ్రాప్ 2'గా మేకర్స్ విడుదల చేశారు.హార్డీ పాత్రలో షారూఖ్, మను పాత్రలో తాప్సీ మధ్య ఉండే ప్రేమను తెలియజేసేలా ఈ సాంగ్ ఉంది. విజువల్ గా కూడా ఈ పాట చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ అందరికీ కలిగింది. ఇంకా అలాగే జవాన్ సినిమాలో కుస్తీ గ్రౌండ్ మ్యాజిక్‌ను షారూక్ ఖాన్ డంకీ మూవీలో కూడా తాప్సీతో రిపీట్ చేయబోతున్నట్టు స్పష్టమవుతుంది.దీంతో ‘కుస్తీ రొమాన్స్ అనేది షారుఖ్ కి హిట్ సెంటిమెంట్ గా మారిపోతుంది’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఒక్క ప్లాప్ లేని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ‘డంకి’ సినిమాకి దర్శకుడు. డిసెంబర్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు చాలా గ్రాండ్ గా రాబోతుంది.ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 7 న రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: