పఠాన్, జవాన్ వంటి భారీ విజయాల తర్వాత షారుక్ ఖాన్ నటిస్తున్న   'డంకీ' డిసెంబర్ 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో అపజయం ఎరగని దర్శకుడిగా పేరుందిన రాజ్ కుమార్ హిరానీ వంటి టాలెంటెడ్ ఫిలిం మేకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ ఆడియన్స్మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ భారీ రెస్పాన్స్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే డ్రాఫ్ 2 పేరుతో ఓ పాట విడుదల చేశారు. 'లుట్ పుత్ గయా' అంటూ సాగే ఈ పాట ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంది.

 ఇక ఇప్పుడు సినిమా నుంచి డ్రాప్ 3 అంటూ మరో పాటను విడుదల చేశారు. 'నిక్లే తే కభీ హమ్ ఘర్ సే' అంటూ సాగే ఈ పాట సినిమాపై ఉన్న హైప్ ను మరింత పెంచేలా ఉంది. ప్రీతమ్ చక్రవర్తి కంపోజ్ చేసిన ఈ పాటను సోను నిగమ్ పాడారు. జావేద్ అక్తర్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ భావోద్వేగాలను తట్టి లేపేలా ఉంది. ఇంటి నుంచి దూరంగా ఉంటూ ఇంటి దగ్గర ఉన్న తమ వాళ్ళని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ని ఈ పాటతో క్రియేట్ చేశారు. కచ్చితంగా ప్రతి వ్యక్తి మనసును తాకేలా ఈ పాట ఉంది. సినిమాలో మనసును హత్తుకునే ఎమోషన్ కూడా ఉందని 

ఈ పాట ద్వారా మేకర్స్ తెలిపే ప్రయత్నం చేశారు. ఇక ఈ సాంగ్ గురించి చెబుతూ షారుక్ ఖాన్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ క్యాప్షన్ పెట్టారు." ఇవాళ ఎందుకో నా మనసుకు తోచింది. దీంతో ఈ పాటను మీతో షేర్ చేసుకుంటున్నాను. రాజు, సోను పేర్లు వింటే మనవాళ్లే అన్న భావన కలుగుతుందిమ్. ఇద్దరు కలిసి చేసిన ఈ పాట కూడా మన వాళ్ళదే. మన ఇంట్లోని వాళ్ల జ్ఞాపకాలది. మన మట్టిది. మన దేశం ఒడిలో ఓ రకమైన హాయి దొరుకుతుంది. మనమందరం ఎప్పుడో ఒకసారి ఇంటి నుంచి, ఊరి నుంచి, పట్టణం నుంచి దూరంగా వెళ్తాం. మన జీవితం కోసం. కానీ మన మనసులు మాత్రం ఇంట్లోనే ఉండిపోతాయి. డంకీలో నా ఫేవరెట్ ఇది" అని షారుక్ రాసుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: