మన దేశంలో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ క్రీడకు లేనంత క్రేజ్ కేవలం క్రికెట్కు మాత్రమే ఉంటుంది. అందుకే ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా టీవీకి అతుక్కుపోతూ ఉంటారు అని చెప్పాలి. మ్యాచ్ లోని ఉత్కంఠను ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ఇక ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టి క్రికెటర్లకు సంబంధించిన విషయం ఏదైనా సోషల్ మీడియాలకు వచ్చింది అంటే చాలు అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 ముఖ్యంగా క్రికెటర్లకు సంబంధించిన ప్రేమాయణాలు అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. కాగా అటు క్రికెటర్లకు సిరి సెలెబ్రిటీలకు మధ్య ప్రేమాయనం అనేది ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూనే వస్తుంది. ఇప్పటివరకు ఎంతోమంది క్రికెటర్లు సినిమా హీరోయిన్లు ఇలా ప్రేమలో మునిగితేలి ఆ తర్వాత పెళ్లితో ఒక్కటైన వారు ఉన్నారు. ఇంకొంత మంది కేవలం ప్రేమను కొనసాగించి ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకొని విడిపోయిన వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే నాకు కూడా ఇలా ఓ టీమ్ ఇండియా క్రికెటర్ తో బ్రేకప్ అయ్యింది అంటూ ఇటీవల నటి పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.


 ఊసరవెల్లి మూవీ ఫేమ్ పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికర పోస్టు పెడుతూ.. వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇటీవల ఆమె భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి ఉన్న ఒక సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆమె చేసిన కామెంట్స్ మరింత హాట్ టాపిక్ గా మారిపోయాయి. మాకు బ్రేకప్ అయిన తర్వాత నేను అనారోగ్యానికి గురయ్యాను. కొన్నెళ్ల పాటు ఏ పని చేయలేకపోయాను  నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి అతనే. మళ్ళీ ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదు అంటూ పాయల్ ఘోష్ కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: