
ఆమె ప్రకటనతో అభిమానులకు కాస్త ఊరట కలిగింది.. అయితే గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. విజయకాంత్ ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతున్న సమయంలో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్, నిర్మాత శివ ఆస్పత్రికి వెళ్లారు. విజయకాంత్ ఆరోగ్యం గురించి వైద్యుల ద్వారా పలు విషయాలను తెలుసుకున్నారు.అనంతరం నడిఘర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 'కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయనపై వస్తున్న వార్తలు నమ్మెద్దు. విజయకాంత్ త్వరలో అభిమానులను కలుస్తారు. అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. కానీ ICU వార్డులో అతను ఉన్నందున మేము చూడలేకపోయాం. కానీ విజయకాంత్ ఆరోగ్యంపై తమకు వైద్యులు సమాచారం అందించారు. వైద్య భద్రత దృష్ట్యా ఆయన్ను చూసేందుకు అనుమతించలేదు.' అని తెలిపారు. దీంతో ఆయన అభిమానులకు కాస్త ఊరట కలిగింది.. అయితే గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి.