
అయితే ప్రభాస్ అభిమానులకు మరొక బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అదేమిటంటే సలార్ సినిమా నుంచి మరో ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్లో సలార్ సినిమా సునామి కొనసాగుతూ ఉండగానే ఇలా సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండడంతో రెండో ట్రైలర్ ని సైతం విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ప్రభాస్ నూ చాలా హైలెట్ చేస్తూ ఈ ట్రైలర్ ని కట్ చేసినట్లుగా సమాచారం.
సలార్ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను వ్యూస్ పెరగడానికి కూడా మేకర్స్ మరింత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈమె పాత్ర కూడా చాలా తక్కువగానే ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శృతిహాసన్ ఇందులో టీచర్ గా కనిపించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు మాత్రం ఈ చిత్రాన్ని కేజిఎఫ్ ని మించి తెరకెక్కించారని తెలుపుతున్నారు.సలార్ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను సైతం అబ్బురపరిచేలా ఉంటుందని తెలియజేశారు. మరి సలార్ సినిమా థియేటర్లో రాకతో ఏ విధంగా షేర్ చేస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.