తెలంగాణ 2023 ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల లో బిఆర్ఎస్ ఓటమి చెందగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు.ఇక కాంగ్రెస్ పార్టీ గెలవడం తో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదిక గా భావోద్వేగమైనటువంటి పోస్ట్ చేశారు. మాకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఎన్నికల ఫలితాలలో మేము ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందామని ఈయన భావోద్వేగం వ్యక్తం చేశారు.అదేవిధంగా తెలంగాణలో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎంతోమంది రిప్లై ఇస్తూ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ గా ఇండస్ట్రీ లో సక్సెస్ అయినటువంటి అనసూయ  కూడా కేటీఆర్ పోస్ట్ పై స్పందిస్తూ ఇచ్చినటువంటి రిప్లై ప్రస్తుతం వైరల్ గా మారింది. అనసూయ రిప్లై ఇస్తూ సార్ మీరు నిజమైన నాయకులు ఎంతోమందికి మీరు స్ఫూర్తిగా నిలిచారు. ఇక మన రాష్ట్ర పరిస్థితిని అవతల వైపు నుంచి కూడా చూడాల్సిన అవసరం మీకు ఉంది. ఇలాంటి పరిస్థితులలో మీరు బలమైన ప్రతిపక్షంగా ఉండి మీరు చేయాల్సింది చేయాలని కోరుకుంటున్నాను.  ఇప్పటివరకు మీరు హైదరాబాద్ కి చేసిన అభివృద్ధికి ధన్యవాదాలు అన్నింటిలోనూ ఈ నగరంలో పురోగతి సాధించేలా చేసినందుకు ఈ హైదరాబాద్ నగరం తో ప్రేమలో పడ్డాను అంటూ అనసూయ తన అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా కెసిఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని పొగుడుతూ ఈ సందర్భంగా ఈమె రిప్లై ఇవ్వడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అనసూయ చేసిన పోస్ట్ పై పలువురు విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: