సూపర్ స్టార్ రజనీ కాంత్ తన కెరియర్ లో ఇప్పటి వరకు అనేక విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే రజినీ కాంత్ తన కెరియర్ లో నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలలో శివాజీ మూవీ ఒకటి. ఈ మూవీ కి దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రేయ ఈ సినిమాలో రజనీ కి జోడిగా నటించింది. 

ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సుమన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే సూపర్ స్టార్ రజినీ కాంత్ మూవీ లో హీరో గా నటించడం ... సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు ఆ సమయంలో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా 2007 వ సంవత్సరం థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఇలా ఆ సమయంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమాను తిరిగి మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఈ మూవీ ని డిసెంబర్ 12 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: