తెలుగు సినీ పరిశ్రమలో డాన్స్ కొరియో గ్రాఫర్ గా ... దర్శకుడిగా ... నటుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోగా కూడా నటించి మంచి విజయాలను అందుకున్నాడు. తాజాగా రాఘవ లారెన్స్ "జిగర్ తండా  డబల్ ఎక్స్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఇకపోతే ఈ మూవీ లో నటుడిగా ... దర్శకుడిగా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న ఎస్ జె సూర్య కూడా ప్రధాన పాత్రలో నటించాడు. 

మూవీ కి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాలో రాఘవా లారెన్స్ ... ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలలో నటించడం ... ఈ మూవీ కి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి "సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు నుండి అనగా డిసెంబర్ 8 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్  వారు తమిళ్ , తెలుగు , మలయాళ , కన్నడ , హిందీ భాషలలో తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: