టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర.. ఈ చిత్రానికి సంబంధించి గత కొద్ది రోజులుగా అప్డేట్ సైతం చిత్ర బృందం విడుదల చేస్తూనే ఉంది. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తున్నది. మొదటి భాగం వచ్చే ఏడాది ఆగస్టు 5వ తేదీన విడుదల చేసేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చిత్రబృందం . ఈ సినిమా షూటింగ్ కూడా సెలవేగంగా జరుగుతోంది.


ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రభాస్ సలార్ సినిమాకి.. షారుక్ డంకీ చిత్రానికి మధ్యలో ఈ సినిమా టీజర్ ని విడుదల చేయాలని భావించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు కాస్త ఆలస్యం అవ్వడం చేత ఈ సినిమా టీజర్ ను ఆలస్యంగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..VFX పనులు పూర్తి అయిన వెంటనే దేవర సినిమా టీజర్ ను విడుదల చేసేందుకు ఖచ్చితమైన తేదీని సైతం చిత్ర బృందం నిర్ణయించబడుతోందని తెలియజేశారు.దేవర సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతున్నది. దేవర సినిమా షూటింగ్ అయిపోగానే ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్-2 చిత్రంలో నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటిసారి బాలీవుడ్లో తన హవా చూపించాలని చూస్తున్నారు ఎన్టీఆర్సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ఒక సినిమాని చేయబోతున్నారు. ఆ తర్వాతే దేవర రెండవ భాగం ఉండబోతోందని సమాచారం. దాదాపుగా ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ లు మొత్తం అన్ని కలుపుకుంటే 1200 కోట్లకు పైగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: