మోహన్ బాబు వారసురాలిగా మంచు లక్ష్మి  ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమా లలో నటించారు.అనంతరం పలు సినిమాలలో నెగిటివ్ పాత్ర లలో కూడా నటించారు. ఇలా సినిమాలు మాత్రమే కాకుండా లక్ష్మీ మంచు పలు టాక్ షోలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈమె టాలీవుడ్ హీరోల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె ఆహాలో ఒక కుకింగ్ షో కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి కూడా పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్ రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరో ల గురించే సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ముగ్గురు హీరోలు నా టాక్ షోలకు పెద్దగా హాజరు కారు అంటూ ఈమె తెలిపారు. ఎందుకు ఈ హీరోలు తమ టాక్ షోలకు హాజరు కారనే ప్రశ్న ఎదురు కావడం తో ఈమె సమాధానం చెబుతూ ఈ ప్రశ్న నన్ను కాకుండా వారిని అడిగితే సమాధానం దొరుకుతుందని తెలిపారు.  ఈ ముగ్గురు హీరోలకు బహుశా నా షోస్ అంటే చులకనేమో అందుకే నా షోలకు రారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈమె వ్యాఖ్యలపై కొందరు స్పందిస్తూ గతంలో ఈమె లక్ష్మీ టాక్ షో నిర్వహించిన సమయంలోను అలాగే ఈటీవీలో కొన్ని టాక్ షోలను నిర్వహించిన సమయంలో ప్రభాస్ ఎన్టీఆర్ ఇతర టాలీవుడ్ స్టార్స్ అందరు కూడా హాజరయ్యారని కానీ వీరి విషయం లో మంచు లక్ష్మి ఇలాంటి కామెంట్ చేయడానికి కారణం ఏంటో తెలియడం లేదు అంటూ ఈమె వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: