తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లో కొంతమంది హీరోలకి తొందరగా పేరు వస్తే మరి కొంతమందికి మాత్రం చాలా సినిమాలు చేసిన తర్వాత హీరోగా మంచి గుర్తింపు అనేది వస్తుంది.ఇలాంటి వాళ్ల లో విశ్వక్ సేన్ ఒకడు. ఈయన తో పాటు ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోలు స్టార్ హీరోలు గుర్తింపు పొందుతుంటే విశ్వక్ సేన్ మాత్రం మొదటి చేసిన రెండు మూడు సినిమాల తో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు కానీ హిట్ సినిమా సక్సెస్ ట్రాక్ ఎక్కి తను ఒక మంచి హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ఆ తర్వాత వచ్చిన అశోక్ వనం లో అర్జున కళ్యాణం అనే సినిమా కూడా అతనికి మంచి గుర్తింపును తెచ్చింది.ఇక ఫలక్ నుమా దాస్ తో తను ఒక మాస్ హీరోగా ఎలివేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అయితే ఈ సినిమా తో మరోసారి మాస్ అంటే ఎలా ఉండబోతుందో చూపిస్తానంటూ ఇప్పటికే విశ్వక్ సేన్ చాలా రకాల కామెంట్స్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో విశ్వక్ సేన్ రేంజ్ మారబోతుంది అంటూ తను చాలా గట్టి నమ్మకం తో ఉన్నాడు. మరి ఈ సినిమా విశ్వక్ సేన్ కి ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో వేచి చూడాలి...ఇక దీంతో పాటుగా ఆయన కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో కూడా మరొక సినిమా కమిటీ అయినట్టుగా తెలుస్తుంది. నిజానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఈ మంత్ లోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: