అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మొదటిసారి తన అదృష్టాన్ని పరీక్షించు కోని మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ చిత్రం హిందీలో కూడా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీలు సైతం డైరెక్టర్కు సెల్యూట్ చేస్తున్నారు.. కంటెంట్ చాలా బ్రిలియంట్ గా ఉందంటూ పొగిడేస్తూ ఉన్నారు. మరి కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు.


తండ్రి కొడుకుల బంధాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన స్టైల్ లో ఆవిష్కరించారని తెలియజేశారు. దాదాపుగా ఈ సినిమా ఇప్పటివరకు 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి కంటే ముందుగా అంతకుమించి బోల్డ్ రస్టింగ్ స్టోరీని హీరో నాగచైతన్య కోసం రాశారట. అయితే ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అలాంటి సబ్జెక్ట్ చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరనే డౌట్ తో ఆ సినిమాని డైరెక్టర్ సందీప్ రెడ్డి హోల్డ్ లో పెట్టడం జరిగిందట.


ఆ తర్వాత అర్జున్ రెడ్డి కథ తీసుకొని  శర్వానంద్ కి ముందుగా వినిపించారట. అయితే కథ నచ్చిన అలాంటి కంటెంట్తో సినిమా చేయడానికి ధైర్యం చాలలేదట. అదే సమయంలో పెళ్లిచూపులతో సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి సినిమా అని తీసుకువెళ్లి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఇక తన నెక్స్ట్ సినిమాలో లైనర్ విషయానికి వస్తే ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబుతో చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి నాగచైతన్యతో అనుకున్న ప్రాజెక్టును ఇప్పుడైనా తెరకెక్కిస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: